కశ్మీర్ వెళ్తా… రంజన్ గొగోయ్‌

కశ్మీర్ వెళ్తా…  రంజన్ గొగోయ్‌

న్యూ ఢిల్లీ : కశ్మీర్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటే తానే స్వయంగా అక్కడ పర్యటిస్తానని అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్  వెల్లడించారు. కశ్మీర్ టైమ్స్ సంపాదకుడు అనురాధ భాసిన్, బాలల హక్కుల కార్యకర్తలు ఎనాక్షి గంగూలీ, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదిత రులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టారు. అనురాధ భాసిన్ తరపు న్యాయవాది వృందా గ్రోవర్ తన వాదన వినిపిస్తుండగా జస్టిస్ బాబ్డే జోక్యం చేసు కున్నారు. జమ్మూ-కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి అక్కడి ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. అక్కడ కనీసం అంతర్జాలం, ప్రజా రవాణా వ్యవస్థ కూడా లేనందున అక్కడి హైకోర్టును ఆశ్రయించడం కష్టంగా మారిందని గ్రోవర్ విన్నవించారు.‘జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి అక్కడి పిల్లలను అక్రమంగా నిర్బంధిస్తున్నార’ని బాలల హక్కుల కార్యకర్తలు ధర్మాసనానికి విన్న వించారు. అరెస్టయిన వారిలో 18 ఏళ్ల లోపు పిల్లలందరినీ విడుదల చేయాలని కోరారు. దీంతో పిటిషనర్లు జమ్మూ-కశ్మీర్ ఉన్నత న్యాయ స్థానంలో విన్నవిం చాలని గొగయ్ సూచించారు. అయితే హైకోర్టును ఆశ్రయించడం కష్టంగా ఉందని పిటిషనర్ల న్యాయవాది పేర్కొనటంతో ప్రధాన న్యాయ మూర్తి  తీవ్ర విస్మయం చెందారు. ‘హైకోర్టుకు వెళ్లడం కష్టంగా ఉందంటూ మీరు చెప్పడం చాలా తీవ్రమైన విషయం. మీరు హైకోర్టుకు వెళ్ల కుండా ఎవరైనా అడ్డు తగులు తున్నారా? ఎందుకని చెప్పండి?..’’ అని గొగోయ్ ప్రశ్నించారు. కశ్మీర్లో కొనసాగుతున్న మూసివేత కారణంగానే తాము హై కోర్టును ఆశ్రయిం చడం కష్టమవుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు.‘… హైకోర్టుకు రావడం పోవటం ఉందన్న ఆరోపణలపై పూర్తి నివేదిక సమర్పిం చాలంటూ జమ్ము-కశ్మీర్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు. ‘హైకోర్టును ఆశ్రయించలేకపోవడం అనేది చాలా తీవ్రమైన విష యం. అది నిజమే అయితే నేనే కశ్మీర్లో పర్యటిస్తాని’ని పేర్కొన్నారు. ‘పిటిషనర్ల వాదనకు హైకోర్టు నివేదిక వ్యతిరేకంగా ఉంటే తీవ్ర పరిణామాలకు సి ద్ధం  గా ఉండాలని పిటిషనర్లను హెచ్చరించారు. జమ్మూ-కశ్మీర్లో సాధారణ పరిస్థితి కొనసాగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్నిఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos