అనీషాతోనే విశాల్ పెళ్లి..

  • In Film
  • October 12, 2019
  • 113 Views
అనీషాతోనే విశాల్ పెళ్లి..

తమిళంలో విభిన్న చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్ వివాహం ఆగిపోయిందంటూ కొద్ది కాలంగా వినిపిస్తున్న వార్తలకు విశాల్ తండ్రి,నిర్మాత జీకే రెడ్డి స్పందించారు. ముందుగా నిర్ణయించినట్టు అనీశా రెడ్డితోనే జరుగుతుందని జీకే రెడ్డి స్పష్టం చేశారు.మార్చి 18న విశాల్‌-అనీషా నిశ్చితార్థమూ హైదరాబాద్‌లో ఘనంగా జరిగిని విషయం తెలిసిందే.ఈ నెల 9న వివాహమని అంతా అనుకున్నా వివాహం జరగకపోవడం, దీనికి సంబంధించిన వార్తలేవీ బయటకు రాకపోవడంతో ఇద్దరి నిశ్చితార్థం రద్దయిందన్న పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జీకే రెడ్డి స్పందించారు. వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలన్న విషయమై ఇంతవరకూ తేదీని నిశ్చయించలేదని స్పష్టం చేశారు. నడిగర్ సంఘం నూతన భవంతిలో వారి పెళ్లి వైభవంగా జరుగుతుందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos