‘మా భాషను అవమానించారు.. సారీ చెప్పండి’ కేరళ నర్సుల ఆందోళన!

‘మా భాషను అవమానించారు.. సారీ చెప్పండి’ కేరళ నర్సుల ఆందోళన!

ఢిల్లీ: విధుల్లో ఉన్నప్పుడు నర్సులు తమ మాతృభాషలో మాట్లాడరాదని హిందీ లేక ఇంగ్లీష్లో మాట్లాడాలని ఇక్కడి జీబీ పంత్ ఆస్పత్రి జారీ చేసిన ఉత్తర్వు వివాదాస్పద మైంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను తాజాగా ఉపసంహరించుకుంది. తమ భాషను అవమానించారని, ఇందుకు క్షమా పణలు చెప్పాలని కేరళ నర్సులు డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ స్వయంగా రంగంలోకి దిగి వివాదాస్పద ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని జీబీ పంత్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. దీంతో వారు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇందుకు బాధ్యుడైన ఆస్పత్రి వైద్యాధికారికీ మెమో ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం ‘విధుల్లో ఉన్న సమయంలో నర్సులు మలయాళంలో మాట్లాడుకుంటున్నారని ఫిర్యాదు అందింది. ఆస్పత్రిలోని అధిక శాతం పేషెంట్లు, సహోద్యోగులకు ఈ భాష తెలియదు.. దీంతో.. వారు ఏం జరుగుతోందో అర్థం కాక తికమక పడుతున్నారు. అందువల్ల నర్సులు అందరూ హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని నిర్దేశించడమైంది. అలా కాని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అంటూ ఆస్పత్రి వర్గాలు ఓ సర్క్యులర్ జారీ చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos