కర్ఫ్యూ ఎత్తేస్తేనే కశ్మీరీలు ఏం చేస్తారో తెలుస్తుంది

కర్ఫ్యూ ఎత్తేస్తేనే కశ్మీరీలు ఏం చేస్తారో  తెలుస్తుంది

న్యూఢిల్లీ: కేంద్రం జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినందుకు దేశ ప్రజల స్పందనకు వ్యతిరేకంగానే కశ్మీర్ వాసుల అభిప్రాయం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులా నబీ ఆజాద్ బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం అక్కడ (జమ్మూ కశ్మీర్) కర్ఫ్యూ ఉంది. ఆ కర్ఫ్యూ ఒక్కసారి ఎత్తేస్తే.. 370, 35ఏ అధికరణ రద్దును జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆహ్వానిస్తారా? ఆగ్రహిస్తారా? అనే విషయం తెలుస్తుంది. ఏ దేమైనా కేంద్రం చర్యలపై కశ్మీరీల్లో అంతర్లీనంగా వ్యతిరేకత ఉందనేది స్పష్టం’ అన్నారు. ఇప్పటికే కార్గిల్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విధ్వంసర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos