రెస్టారెంట్‌ వద్ద లైన్‌లో బిల్‌గేట్స్‌!

రెస్టారెంట్‌ వద్ద లైన్‌లో బిల్‌గేట్స్‌!

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సంపన్నుడే అయినా సాధారణ జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారాయన. అందులోనూ ఫాస్ట్‌ఫుడ్‌ అంటే ఆయనకు చాలా ఇష్టమట. ఎప్పుడూ వాషింగ్టన్‌లో ఆయన నివసించే బెల్లెవ్యూ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న బర్గర్‌ షాప్‌ వద్దకు వెళుతుంటారు. అయితే మైక్‌ గాలోస్‌ అనే నెటిజన్‌ పోస్ట్‌ చేసిన బిల్‌గేట్స్‌ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. స్థానిక బర్గర్‌ రెస్టారెంట్‌ వద్ద సాధారణ వ్యక్తిలా ఆయన లైన్‌లో వేచిచూస్తున్నప్పుడు తీసిన ఫొటో అది. ‘కోట్ల ఆస్తి ఉండి.. ప్రపంచంలోనే అతిపెద్ద ఛారిటీకి యజమాని అయివుండి ఓ బర్గర్‌ కోసం సాధారణ వ్యక్తిలా లైన్‌లో వేచిచూస్తున్న బిల్‌గేట్స్‌. నిజమైన సంపన్నులు ఇలాగే ప్రవర్తిస్తారు’ అని మైక్‌ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే.. మైక్‌ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగి. అయితే గేట్స్‌ ఫొటోను తాను తీయలేదని మరో మాజీ ఉద్యోగి తీసి దానిని మైక్రోసాఫ్ట్‌ అల్యూమ్నీ బోర్డ్‌లో పెట్టారని పేర్కొన్నారు. గేట్స్‌ సింప్లిసిటీ నచ్చి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయాలనిపించిందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos