వినాయక నిమజ్జనానికి భారీ భద్రత

వినాయక నిమజ్జనానికి భారీ భద్రత

హైదరాబాద్‌ : వినాయకుని నిమజ్జనం సంర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజన్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 21 వేల మంది పోలీసులు, 56 కంపెనీల కేంద్ర బలగాలతో బందోస్తును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నగరంలోని అయిదు జోన్లలో వివిధ రంగులతో చిహ్నం స్టిక్కర్లను నెలకొల్పుతామన్నారు. గణేష మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరతామన్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని ఉదయం పూట నిమజ్జనం చేసేలా ఉత్సవ కమిటీ చర్చించనున్నట్లు చెప్పారు. నగరంలో ఇప్పటి వరకు ఏడు వేల గణేష మండపాలకు నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos