సాగు చట్టాల రద్దు తర్వాతే చర్చలు

సాగు చట్టాల రద్దు తర్వాతే చర్చలు

న్యూ ఢిల్లీ : ముందుగా నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతే రైతులతో మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాజస్థాన్లో జరిగిన ‘మహా కిసాన్ పంచాయత్’ సభలో శుక్రవారం మాట్లాడారు. ‘చట్టాలను రద్దు చేయనంత వరకు చర్చలు చేసి లాభం లేదు. చట్టాలు రద్దు చేసేంత వరకు మేము రైతులతోనే ఉంటాం. జీఎస్టీ, సాగు చట్టాలు కేవలం బడా కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికే మోదీ వీటిని తెచ్చారు. ఇలా చేయడం ద్వారా వ్యాపారులు, చిన్న తరహా దళారులు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. . నూతన సాగు చట్టాలు రైతు మేలుకోరే తీసుకొస్తే, దేశ వ్యాప్తంగా రైతులు ఎందుకు నిరసన తెలుపుతున్నారో చెప్పాలి. నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో సుమారు 200 మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. దీనికి ప్రభుత్వం వద్ద ఏం సమాధానం ఉందో చెప్పాలి. సాగు చట్టాల ద్వారా మండీల వ్యవస్థ సర్వ నాశనం అవుతుంది. బడా వ్యాపారులు ఇష్టం వచ్చిన రీతిగా ధాన్యాలను నిలువ చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా ధర విష యంలో బడా వ్యాపారులకు పూర్తి అధికారం ఇచ్చినట్లయింద’ని విమర్శించారు. నూతన సాగు చట్టాల ద్వారా ఒకే వ్యక్తి పంట ధరను నిర్ణయించే అవకాశం ఉందని, ఒకే సంస్థ వీటిని విక్రయించే వీలుందని, ఇలా చేస్తే పేద రైతులు ఏంకావాలో చెప్పాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలతో చిన్న వ్యాపారులు ఎలాంటి వ్యాపారమూ చేయడానికి అవకాశం లేకుండా పోయిందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos