కశ్మీర్‌ ప్రతిపత్తిని పునరుద్ధరించాలి

కశ్మీర్‌  ప్రతిపత్తిని పునరుద్ధరించాలి

న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్రం కేంద్రం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోమారు తప్పుబట్టారు. ‘ఆ రాష్ట్రంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ప్రభుత్వ నిర్ణయం తప్పనేదుకు ఇంతకు మించిన రుజువు ఏముంటుంద’ని అన్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. 370 అధికరణ రద్దుకు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసారు. నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలను వెంటనే విడుదలచేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos