అఫ్రిది వ్యాఖ్యలపై గంభీర్ ‘హిట్`

అఫ్రిది వ్యాఖ్యలపై గంభీర్ ‘హిట్`

ఢిల్లీ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది తనపై చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ దీటుగానే స్పందించాడు. తన ఆత్మకథ గేమ్‌ ఛేంజర్‌లో అఫ్రిది, గంభీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ ఆడే రోజుల్లో గంభీర్‌కు వ్యక్తిత్వమే లేదని, సానుకూల దృక్పథం కనిపించేది కాని…ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానాలు చేశాడు. దీనిపై స్పందించిన గంభీర్‌, వైద్య సేవల కోసం పాకిస్థానీలకు తమ దేశం ఇంకా వీసాలు మంజూరు చేస్తోందని, అప్రిది వస్తే తానే స్వయంగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్తానని ఘాటుగా సమాధానమిచ్చాడు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్‌, ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్నా, అఫ్రిది తనపై చేసిన వ్యాఖ్యలకు సరిగ్గా బదులిచ్చాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos