నలుగురికీ ఏక కాలంలో ఉరి

నలుగురికీ ఏక కాలంలో ఉరి

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం దోషులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లకు ఉరి శిక్ష అమలుకు తీహార్ చెరసాల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మీరట్ చెరసాల నుంచి ఉన్న తలారిని రప్పించారు. 1950లో ఏర్పాటు చేసిన ఉరి కొయ్యలను పరిశీలించారు. ఉరికొయ్య నలుగురు దోషుల బరువును మోస్తుందా? అని పరిశీలించారు. అవసరమైతే మరో కొయ్య ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. నలుగురినీ ఏక కాలంలో ఉరితీయదలచారు. బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మనీలా ఉరితాళ్లను తెప్పించనున్నారు. ఇవి మృదువుగా, బలంగా ఉంటాయి. దోషులు తక్కువ బాధతో ప్రా ణా లు విడిచేందుకు తాళ్లకు వెన్నరాయాలని నిర్ణయించారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకూ ఒకసారి దోషులు తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తున్నారు. వారు నిత్యమూ న్యాయవాదులను కలుస్తూ, తమ కేసు పురో గతిని తెలుసుకుంటున్నారని, వారి ప్రవర్తనలో తాము ఎటువంటి మార్పునూ గమనించలేదని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos