రాజకీయాలు వద్దనిపిస్తోంది…

నాగ్‌పూర్‌ : రాజకీయాలు వదిలేయాలని తరచూ అనిపిస్తోందని కేంద్ర రవాణా, ప్రధాన రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాజకీయాలు సామాజిక మార్పు కోసమే తప్ప అధికారమే పరమావధిగా ఉండరాదని ఆయన సూచించారు. రాజకీయాలను మించి జీవితం ఉందన్నారు. 2014లో రాజకీయాలకు స్వస్తి చెప్పి సామాజిక కార్యకర్తగా మారిన ఎన్సీపీ మాజీ ఎమ్మెల్సీ గిరీశ్ గాంధీకి నాగ్‌పూర్‌లో జరిగిన సన్మాన సభలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలనేవి సామాజిక, ఆర్ధిక సంస్కరణలకు మార్గం కావాలి తప్ప అధికారం కోసం వెంపర్లాడటమే అంతిమ లక్ష్యం కారాదని గడ్కరీ సూచించారు. రాజకీయాలు సమాజ అభివృద్ధి కోసం మార్గం కావాలన్నారు. విద్యాభివృద్ధి కోసం, కళల అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.
జాతీయ రహదారుల మంత్రిగా మంచి మార్కులు తెచ్చుకున్న గడ్కరీ గాయకుడు కూడా. మిగిలిన రాజకీయ నేతల్లా కాకుండా సంగీతం, సాహిత్యంలో కూడా తనదైన ముద్ర వేశారు. తరచూ వేదికలపైన పాటలు పాడుతూ అందరినీ అలరిస్తుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos