సుప్రీంకోర్టులో పాండ్యా – రాహుల్ భవితవ్యం

  • In Sports
  • January 18, 2019
  • 180 Views
సుప్రీంకోర్టులో పాండ్యా – రాహుల్ భవితవ్యం

‘కాఫీ విత్ కరణ్’ అనే బాలీవుడ్ ప్రఖ్యాత టీవీ షోలో మహిళలపై నోరుజారిన భారత క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా కేఎల్ రాహుల్ లు చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే.. వారిద్దరిపై సస్పెన్షన్ విధించిన బీసీసీఐ ప్రస్తుతం కమిటీ వేసి విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో వారిద్దరిపై సుప్రీం కోర్టులో అంబుడ్స్ మెన్ దాఖలైంది. వారిద్దరిపై విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ పాలకకమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్ మెన్ ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో పాండ్యా – రాహుల్ పై విచారణ ఇప్పట్లో తేలేలా లేదు. వారు టీమిండియాకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరిపై బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ కూడా తన నివేదికను తీసి అంబుడ్స్ మెన్ కు ఇవ్వాలి. లోథా కమిటీ సిఫారసుల అమలు బీసీసీఐ ఎన్నికలు తదితర అంశాలతోపాటు పాండ్యా-రాహుల్ అంశంపై కూడా సుప్రీం కోర్టులో గురువారం వాదనలు కొనసాగాయి. బీసీసీఐ అంబుడ్స్ మన్ ను నియమించే అధికారం బీసీసీఐకే ఇవ్వాలని కోరగా.. ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాతే మాత్రమే అది సాధ్యమని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ వాయిదా వేసింది.  రెండు వన్డేల నిషేధం విధించాలని బీసీసీఐ సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ భావించాడు. కానీ సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహా కోరడంతో కోర్టు వరకు వెళ్లింది. కోర్టుకు చేరడంతో ఇప్పుడు పాండ్యా – రాహుల్ భవిష్యత్ గందరగోళంలో పడింది. అటు ఆట ఆడకుండా.. ఇటు కోర్టులో తేలకుండా వారి పరిస్థితి దారుణంగా తయారైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos