గాలి మనుషులు ప్రలోభపెట్టారు – సీబీఐ మాజీ న్యాయమూర్తి..

గాలి మనుషులు ప్రలోభపెట్టారు – సీబీఐ మాజీ న్యాయమూర్తి..

బెయిల్‌ కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించారంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి సీబీఐ మాజీ న్యాయమూర్తి నాగమారుతి శర్మ సోమవారం కోర్టులో సాక్ష్యం చెప్పారు.గాలి జనార్ధనరెడ్డి బెయిల్‌ కోసం గాలి మనుషులు తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారంటూ నాగమారుతీ శర్మ సాక్ష్యం చెప్పారు.ఓబుళాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి సీబీఐ గాలి జనార్ధనరెడ్డిని అరెస్ట్‌ చేయడంతో గాలికి ఎలాగైనా బెయిల్‌ ఇప్పించాలనే ఉద్దేశంతో 2012 జూన్‌4వ తేదీన హైదరాబాద్‌లోని యాదగిరి రావు అనే రౌడీషీటర్‌ను కలసిన గాలి మనుషులు  యాదగిరి ద్వారా అప్పటి సీబీఐ న్యాయమూర్తి పట్టాభి రామారావుకు లంచం ఇచ్చారు.దీంతో మైనింగ్‌ కేసుకు సంబంధించి న్యాయమూర్తి పట్టాభి గాలి జనార్ధనరెడ్డికి బెయిల్‌ మంజూరు చేశారు.అయితే గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ రావడంతో సీబీఐ విచారణ జరిపగా బెయిల్ స్కాం వెలుగు చూడడంతో నాచారం యాదగిరి రావుతో పాటు పలువురిని   సీబీఐ అరెస్ట్ చేసింది. క్రమంలోనే సమయంలో  సీబీఐ జడ్జిగా ఉన్న నాగమారుతి శర్మను  గాలి జనార్ధన్ రెడ్డి మనుషులు కలిశారు.  బెయిల్ కోసం నాగమారుతి శర్మతో సంప్రదింపులు జరిపారు. విషయమై ఏసీబీ కోర్టులో సోమవారం నాడు నాగమారుతీ శర్మ సాక్ష్యం చెప్పారు.బెయిల్ ఇస్తే తనకు రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని గాలి మనుషుల ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టుగా వివరించారు.ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వచ్చే నెల 12 తేదీకి విచారణను వాయిదా వేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos