ఎస్‌పిసిఏ స్వచ్ఛంద సంస్థ ఔదార్యం

ఎస్‌పిసిఏ స్వచ్ఛంద సంస్థ ఔదార్యం

హోసూరు : ఇక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ వీధి కుక్కలకు నిరంతరాయంగా ఆహారాన్ని అందిస్తూ ప్రాణి దయను చాటుకుంటోంది. గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా పట్టణాలలోని వాణిజ్య సముదాయాలు,  హోటళ్లు మూతబడ్డాయి. లాక్‌డౌన్‌ ప్రభావం ప్రజలపైనే కాకుండా నోరు లేని ప్రాణులపై కూడా పడింది. హోసూరులో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు మూతపడడంతో పట్టణంలోని యాచకులు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి యాచకులకు ఆహారాన్ని అందించి చేయూతనిచ్చాయి. కానీ హోసూరు పట్టణంలోని హోటళ్లు మూతపడడంతో వీధి కుక్కలకు ఆహారం కరువై, ఆకలితో అలమటించేవి. వీటి పరిస్థితిని గమనించిన హోసూరు లోని ఎస్‌పిసిఏ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి పట్టణంలోని వీధి కుక్కలకు ఆహారాన్ని అందించింది. గత రెండు నెలలుగా సంస్థ నిర్వాహకులు ఆహారాన్ని అందిస్తున్నారు. హోసూరు పట్టణంలోనే కాక జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో కూడా వీధి కుక్కలకు ఆహారాన్ని ఇస్తున్నారు. ఎస్‌పిసిఏ స్వచ్ఛంద సంస్థను  పట్టణ వాసులు అభినందిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos