హోసూరులో మూగ జీవులకు ఆహారం : ఎస్ పి సి ఏ సంఘం ఔదార్యం

హోసూరులో మూగ జీవులకు ఆహారం : ఎస్ పి సి ఏ సంఘం ఔదార్యం

హోసూరు : హోసూరులో గత 20 రోజులుగా వీధి కుక్కలకే కాక పశువులకు కూడా ఆహారాన్ని అందిస్తూ హోసూరు ఎస్ పి సి ఎ సంఘం తన ఔదార్యాన్ని చాటుకుంది. కరోనా ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హోసూరు మహానగరంలోని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి అదేవిధంగా పట్టణంలోని ప్రముఖ హోటళ్లు కూడా మూతపడడంతో వీధి కుక్కలకు ఆహారం దొరకక ఆకలితో అలమటించే పరిస్థితి దాపురించింది. ఈ సంఘటనను చూసిన ఎస్ పి సి ఏ సంఘ నిర్వాహకులు గత 20 రోజులుగా వీధి కుక్కలకు ఆహారం పెట్టి వాటి ఆకలి తీర్చారు. అదేవిధంగా హోసూర్ పట్టణంలోని రోడ్లలో తిరుగుతున్న వీధి పశువులకు కూడా ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఎస్ పి సి ఏ సంఘం నిర్వాహకులు వివిధ రకాల పండ్లను ఆహారంగా అందించి వాటి ఆకలి తీర్చారు. లాక్ డౌన్ కొనసాగినంత వరకూ వీధి కుక్కలకు మరియు పశువులకు ఆహారాన్ని అందిస్తామని ఎస్ పి సి ఎ నిర్వాహకు లు తెలిపారు వీధి కుక్కలకు, పశువులకు ఆహారంగా అందిస్తున్న ఎస్ పి సి ఎ సంఘ నిర్వాహకుల ను పలువురు ప్రశంసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos