కొనసాగుతున్న పూల పారబోత

కొనసాగుతున్న పూల పారబోత

హొసూరు : హొసూరు ప్రాంతంలో పూల రైతుల కడగండ్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా సరైన గిట్టుబాటు ధర లేకపోవడందతో కోసిన పూలను ఏం చేయాలో దిక్కు తోచక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పొలాల్లో కోసిన పూలను మార్కెట్ దాకా తరలిస్తే కూలి, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు కోసిన పూలను రోడ్ల పక్కనే పారబోస్తున్నారు. హొసూరు, సూళగిరి, డెంకణీకోట తాలూకాల్లో వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాలైన పూలను సాగు చేస్తున్నారు. దసరా సందర్భంగా మంచి ధర లభిస్తుందనే ఆశతో చెండు పూలను వందల ఎకరాల్లో సాగు చేశారు. అయితే కిలో ధర రూ.5కు మించి పలకడం లేదు. హొసూరు మార్కెట్‌కు రోజూ 30 నుంచి 40 టన్నుల పూలు వస్తాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్ దాకా తీసుకెళ్లి నష్టాన్ని మూటగట్టుకోవడం ఎందుకనుకున్నారో…ఏమో చాలా మంది రైతులు హొసూరు-రాయకోట రోడ్డులో పూలను పారవేసి వెళుతున్నారు. దసరా నాటికి ఓ మోస్తరు ధర పలికినా, ఇప్పడొస్తున్న నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంటుందా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos