ఎదుగూ, బొదుగూ లేని ట్రేడింగ్

ఎదుగూ, బొదుగూ లేని ట్రేడింగ్

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎదుగూ, బొదుగూ లేకుండా ట్రేడింగ్ ముగించాయి. మదుపర్లు లాభాల వసూలుకే ప్రాధాన్యత ఇచ్చారు. పర్య వ సానంగా ఉదయం నుంచి సూచీలు తీవ్ర ఒడి దుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 39,097కి పెరిగింది. నిఫ్టీ 12 పాయిం ట్లు నష్టపోయి 11,588 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ (3.78%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.22%), టెక్ మహీంద్రా (3.12%), టాటా మోటార్స్ (2.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.59%) లబ్ధి పొందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.56%), యాక్సిస్ బ్యాంక్ (-3.13%), ఎల్ అండ్ టీ (-3.03%), హీరో మోటో కార్ప్ (-2.42%), ఓఎన్జీసీ (-2.06%) బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos