తెలంగాణలో చేప పిల్లల పెంపకం

తెలంగాణలో చేప  పిల్లల పెంపకం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో చేప పిల్లల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కాళేశ్వరంలోని కోయిల్‌ సాగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చేప పిల్లలను వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. 15 రోజుల్లోగా చేప పిల్లల పంపిణీని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు. ఇటవలి వర్షాలకు జలాశయాలన్నీ నిండాయి. దీంతో చేప పిల్లల విడుదలకు ఇదే సమయమని ప్రభుత్వం భావించింది. ఈ ఏడాది 24,953 నీటి వనరుల్లో రూ.52 కోట్ల విలువైన చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. మొత్తం 80.86 కోట్ల చేప పిల్లలు, అయిదు కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో వేయాలని నిర్ణయించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos