దర్గా చెరువులో చేపల మృతి

దర్గా చెరువులో చేపల మృతి

హొసూరు : పట్టణ ప్రాంతంలోని దర్గా చెరువుకు కలుషిత నీరు చేరడం వల్ల చెరువులోని చేపలు మృత్యువాత పడ్డాయి. హొసూరు-బెంగళూరు జాతీయ రహదారి దర్గా వద్ద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఇటీవల ఓ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఈ చెరువుకు ఎక్కువగా వరద నీరు చేరింది. నిత్యం నీటితో కళకళలాడే దర్గా చెరువులో వేల సంఖ్యలో చేపలు ఉన్నాయి. ఇటీవల  కురిసిన వర్షాలకు వర్షపు నీటితో పాటు కలుషిత నీరు కూడా చెరువులోకి చేరింది. చెరువు నీరు పూర్తిగా కలుషితం కావడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. చేపలు చనిపోవడంతో ఆ ప్రాంతం దుర్గంధమయమైంది. ఈ సంఘటనపై స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దుర్వాసన భరించలేక పోతున్నామని, వెంటనే మృతి చెందిన చేపలను తొలగించి, రోగాలు ప్రబలకుండా చూడాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos