ఐకియాలో అగ్నిప్రమాదం…

ఐకియాలో అగ్నిప్రమాదం…

గత ఏడాది హైదబారాద్‌ నగరంలో అతిపెద్ద షోరూమ్‌ ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టిన ఐకియా మరోసారి వార్తల్లోకెక్కింది.ఒకటవ సెల్లార్‌లో మంటలు చెలరేగడంతో ప్రజలకు ఆందోళనకు గురై పరుగులు తీసశారు.గత ఏడాది వెజ్‌ బిరియానిలో గొంగళి పురుగు రావడంతో వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ఐకియా వార్తల్లోకెక్కింది. ఐకియా నుంచి ఆర్డర్‌ చేసిన వెజ్‌ బిరియానీలో గొంగళి పురుగు రావడంతో ఖంగు తిన్న వ్యక్తి ఫోటోలతో సహా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేసాడు.దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ ఆరోగ్యవిభాగం-వెటర్నరీ అధికారులు దాడులు చేసి రూ.11వేల జరిమానా విధించారు.దాడుల్లో ఐకియా రెస్టారెంట్‌లో నిబంధనలు పాటించడం లేదంటూ అధికారులు గుర్తించారు.తాజాగా షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో మరోసారి ఐకియాలో భద్రత లోపాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆదివారం కావడంతో ఐకియాకు ప్రజలను భారీగా తరలివచ్చారు.ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వెంటనే అప్రమత్తమైన ప్రజలు బయటకు పరుగులు తీయడంతో భారీ ప్రమాదం తప్పింది.సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా షోరూమ్‌ ఏర్పాటు చేసిన మొదట్లో నగరవాసులు ఐకియాలోకి వెళ్లడానికే నాలుగు గంటలు వేచి చూసేవాళ్లు. ఎక్కడిడెక్కిడి నుంచో్ ప్రజలు ఐకియాకు క్యూ కట్టడంతో జనం రద్దీని నియంత్రించడానికి సిబ్బంది నానా అవస్థలు పడ్డారు.ఇప్పటికైనా ఐకియా యజమాన్యం మేలుకోకపోతే ఐకియా ప్రతిష్ట,వ్యాపారం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos