రూపాయి జరిమానాపై ప్రశాంత్ భూషణ్ రివ్వ్యూ పిటిషన్

రూపాయి జరిమానాపై ప్రశాంత్ భూషణ్ రివ్వ్యూ పిటిషన్

న్యూ ఢిల్లీ : అత్యున్నత న్యాయస్థాన ధిక్కారం కేసులో దోషిగా రూపాయి జరిమానా చెల్లించిన విఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గురువారం సమీక్ష వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. సుప్రీం కోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి పై ట్విటర్లో ‘‘పరువు నష్టం’’ కలిగించేలా ఆరోపణలు చేసినందుకు భూషణ్ను సర్వోన్నత ధర్మాసనం దోషిగా ప్రకటించి రూ.1 జరిమానా విధించింది. తీర్పు పట్ల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘జరిమానా చెల్లించినంత మాత్రాన నేను ఈ తీర్పును అంగీకరించినట్లు కాదు. మేము దీనిపై ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశాం. పునర్విచారణకు ఒక ప్రక్రియ ఉండాలి కదా’ని తీర్పు సందర్భంగా భూషణ్ పేర్కొన్నారు. రివ్యూ పిటిషన్ విచారించిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెనక్కితీసుకుని, భూషణ్ను నిర్దోషిగా ప్రకటిస్తే… మళ్లీ ఆ రూపాయిని తిరిగి ఇచ్చేస్తారు. ట్విటర్లో తాను చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పబోననీ.. అవసరమైతే కోర్టులో విచారణ ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమేనని భూషణ్ తేల్చిచెప్పడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. దీంతో వాక్ స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos