రూ. 10 అవినీతికి రూ. 2.45 లక్షల జరిమానా

రూ. 10 అవినీతికి  రూ. 2.45 లక్షల జరిమానా

ముంబై : వినియోగదారు నుంచి రూ.పది అదనంగా వసూలు చేసినందుకు ముంబై న్యాయస్థానం ఇక్కడి సగుణ్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఏకంగా రూ. 2.45 లక్షల జరిమానా విధించింది. ఇక్కడ సబ్ ఇనస్పెక్టర్ జాదవ్ రెస్టారెంట్ నుంచి వెళ్లి ఐస్ క్రీమ్ కొన్నాడు. రెస్టారెంట్ రూ.175 వసూలు చేసింది. ఎంఆర్పీ రూ. 165 . దీంతో రూ. 10 వెనక్కు ఇవ్వాలని జాదవ్ కోరాడు. కూలింగ్ చార్జ్ అని రెస్టారెంట్ సమాధానం ఇచ్చారు. 2014 జూన్ లో ఇది జరిగింది. దీంతో జాదవ్ రెస్టారెంట్ కు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసాడు. జాదవ్ ఇప్పుడు పొందారు. రెస్టారెంట్ అదనంగా డబ్బులు వసూలు చేయడం తప్పని తేల్చిన న్యాయస్థానం రూ. 2.45 లక్షల జరిమానా విధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos