చెల్లి కోసం కుక్కతో పోరాటం..

చెల్లి కోసం కుక్కతో పోరాటం..

కుక్క దాడి నుంచి చెల్లెలిని రక్షించడానికి ఓ బాలుడు ప్రాణాలను ఫణంగా పెట్టాడు.అమెరికాలోని వ్యోమింగ్కు చెందిన బ్రిడ్జర్ వాకర్ అనే ఈ బుడతడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ మారాడు.ఇంటి దగ్గర్లో తన చెల్లితో కలిసి వాకర్ ఆడుకుంటుండగా ఓ కుక్క ఒక్కసారిగా వారిపై అటాక్ చేసింది. దీంతో తన చిట్టి చెల్లిని కాపాడానికి ఆ కుక్క పై వీరోచితంగా పోరాడాడు. కుక్క దాడి చేస్తోన్నా ఓ యోధుడిలా దానిని ఎదిరించి నిలబడ్డాడు. తన ముఖం చిట్లి రక్తం కారుతున్నా..అతడు కుక్కపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. చివరికి ఆ అరుపులు విని వారి పేరెంట్స్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ పిల్లాడి ముఖం కనపడకుండా రక్తంతో నిండిపోయింది. తన సోదరిని కాపాడటానికి అతడు ప్రాణాలే పణంగా పెట్టాడు. ఆ తర్వాత ఆ ఆరేళ్ల పిల్లవాడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఏకంగా 90 కుట్లు పడ్డాయి. ఆపరేషన్ చేసేందుకు వైద్యులు రెండు గంటలు శ్రమించారట.ఈ విషయాన్ని బాలడి అత్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా .. అది విపరీతంగా వైరల్ అయింది. బాలుడి పోరాట పటిమ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ చిన్నోడిని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా అనౌన్స్ చేసింది. బ్రిడ్జర్కు అవార్డు ఇవ్వడాన్ని హెవీవెయిట్ ఛాంపియన్ టైసన్ ఫ్యూరీ వంటి వారు చాలామంది స్వాగతించారు. కమిలిపోయిన ముఖంతో ఉన్న బ్రిడ్జర్ ఫొటోకు భారీగా లైక్లు లక్షల సంఖ్యలో లైకులు షేర్లు వస్తున్నాయి.కుక్క దాడికి యత్నించినప్పుడు ఎందుకు పారిపోలేదని తండ్రి.. బ్రిడ్జర్ను అడగ్గా.. మనసు హత్తుకునే సమాధానం ఇచ్చాడట. “కుక్క చేతిలో ఎవరైనా చనిపోవాల్సి వస్తే.. అది నేను మాత్రమే అయి ఉండాలి అనుకున్నా” అని చెప్పేసరికి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos