జయరాజ్- బెనిక్స్ల హత్య కేసు సీబీఐకి

జయరాజ్- బెనిక్స్ల హత్య కేసు సీబీఐకి

చెన్నై: తండ్రీ కొడుకుల జయరాజ్- బెనిక్స్ల పోలీసు ఠాణా హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమ తినిచ్చింది. ఈ మేరకు మంగళ వారం ఉత్తర్వు జారీ చేసింది. మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు తిరునల్వేలి డీఐజీ నేతృత్వంలో ఈ కేసు విచారణ కొన సాగుతోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు పోలీసు ఠాణాలో చిత్ర హింసలకు గురి చేయటంతో వారు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా వెల్లు వెత్తిన నిరసనలపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ ఉన్నత న్యాయాస్థానం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయాధికారి ఇటీవలే నాలుగు పుటల నివేదిక అందించారు. వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులకు వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరం కింద ప్రాథమికసమాచార నివేదిక దాఖలు చేసారు. పోలీసుల అరెస్టు తో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos