‘షెహన్‌షా’ను జైలుకు పంపిస్తా

‘షెహన్‌షా’ను జైలుకు పంపిస్తా

ఫతేబాద్: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్‌షా(రాబర్డ్ వాద్రా)’ను కటకటాల వెనక్కి పంపిస్తామని ప్రధాని హెచ్చరించారు. భూముల వ్యవహారంలోవాద్రా విచారణను ఎదుర్కొంటున్నారు. హర్యానాలోని ఫతేబాద్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు అతి తక్కువ రేట్లకు రైతుల నుంచి భూములు లాక్కుంటుందని ఆరోపించారు. ‘వాళ్లు బెయిలుపై తిరుగుతున్నారు. ఈడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తామే సార్వభౌమాధికారులమని, తమను ఎవరూ తాకలేరని వారనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లకు వణుకు పట్టుకుంది. వాళ్లను నేను దాదాపు జైలు గుమ్మం వరకూ తీసికెళ్లాను. మీ ఆశీస్సులు నాకు ఇస్తే రాబోయే ఐదేళ్ల లోపే వారిని జైలులో పెట్టిస్తా’ అని తీవ్ర స్వరంతో ఉన్నారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్ము కక్కిస్తానని చెప్పారు . ‘1984 అల్లర్లలో ప్రమేయమున్న వారిని శిక్షిస్తామని మీ చౌకీదార్ హామీ ఇస్తున్నాడు. ఆ ప్రక్రియ మొదలవుతుంది’ అని మోదీ చెప్పారు. 1984లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా దేశంలోని వివిధ ప్రాంతాల సిక్కుల్ని కాంగ్రెస్ కుటుంబం తరఫున దారుణంగా చంపారని ఆరోపించారు. 34 ఏళ్లుగా పది కమిషన్లు వేసినా సిక్కులకు న్యాయం జరగలేదని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos