పోలీసులకు చిన్మయి క్షమాపణ..

  • In Film
  • June 28, 2019
  • 110 Views
పోలీసులకు చిన్మయి క్షమాపణ..

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యామాన్ని బలంగా ముందుకు తీసుకెళుతున్న సినీ ప్రముఖుల్లో గాయని చిన్మయి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.చిత్ర పరిశ్రమలతో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో,సమాజంలో మహిళలు,పిల్లలపై జరుగుతున్న లైంగిక దౌర్జన్యాలు,వేధింపులపై ప్రస్తావిస్తూ చిన్మయి పోరాటం చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో ఎంతోమంది చిన్మయిపై విమర్శలు వ్యక్తం చేసినా,బెదిరించినా,అవమానించినా చిన్మయి మాత్రం ధీటుగా ఎదుర్కొంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.కొద్ది రోజుల క్రితం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుతో పాటు మరికొందరు సెలబ్రిటీల నిజస్వరూపాన్ని బయట పెడుతూ… వీరు తెరవెనక చేసే చీకటి పనులు, లైంగిక వేధింపుల పర్వాన్ని బట్టబయలు చేసి సంచలనం క్రియేట్ చేసింది.కాగా ఉద్యమాల్లో అప్పుడప్పుడూ తప్పులు జరిగినట్లే చిన్మయి కూడా పొరపాటు చేసి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.ఇటీవల సింగర్ చిన్మయి యూపీలో ఓ పోలీసు గురించి చేసిన ట్వీట్ సంచలనం అయింది. ఉత్తప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు అత్యాచార బాధితురాలిని కోర్కె తీర్చాలని వేధింపులకు గురి చేసినట్లుగా ట్విట్టర్లో ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ ‘చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే ఎలా?’ అంటూ ట్వీట్ చేశారు.చిన్మయి చేసిన ఈ ట్వీట్‌పై ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చి పారేసింది. 2017లో జరిగిన ఘటన గురించి 2019లో ఓ సెలబ్రిటీ పోస్ట్‌ చేయడం తాము ఊహించలేదని యూపీ పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.అప్పట్లో సదరు మహిళ తనపై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్సై కూడా తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. విచారణలో ఆమె ఆరోపణల్లో నిజం లేదని తెలిసిన తర్వాత కేసు కొట్టివేశారంటూ యూపీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇలాంటి ఘటనలు జరినపుడు మహిళల్లో చైతన్యం రావాలని, బాధితులకు న్యాయం జరుగాలనే ఉద్దేశ్యంతోనే నేను వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసిన ట్వీట్లో పొరపాటును గమనించినందుకు ధన్యవాదాలు. ఇందుకు నేను క్షమాపణలు చెబుతూ ట్వీట్ డిలీట్ చేస్తున్నట్లు చిన్మయి తెలిపారు.

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos