సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మంగళవారం కొత్త లోగోను ఆవిష్కరించింది.శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో నూతన లోగోను విడుదల చేసింది.ఫేస్బుక్ కు అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నుంచి ఫేస్ బుక్ మరింత స్పష్టతను కోరుకుంటోందని, యూజర్లకు కూడా సామాజిక మాధ్యమాలను గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో లోగోను మార్చినట్టు ఫేస్బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో వెల్లడించారు.ఈ సందర్భంగా ఫేస్బుక్ కొత్త వెబ్ సైట్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని ఆంటోనియో వెల్లడించారు.
Facebook has new company branding https://t.co/oCF4BZbuKt pic.twitter.com/lzOYAoK4nM
— Rob Price (@robaeprice) November 4, 2019