బిగ్‌బాస్‌ 3 కంటెస్టంట్లు వీళ్లేనా!

  • In Film
  • June 7, 2019
  • 237 Views
బిగ్‌బాస్‌ 3 కంటెస్టంట్లు వీళ్లేనా!

తెలుగులో సంచలనం సృష్టించిన బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌ను మరింత కలర్‌ఫుల్‌గా ఆసక్తికరంగా ఒక విధంగా చెప్పాలంటే మరింత వివాదాస్పదంగా ఉండేలా నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు.రెండవ సీజన్‌లో వ్యక్తమైన వ్యతిరేకత దెబ్బతో హోస్ట్‌గా వ్యవహరించడానికి నానితో పాటు ఎవరూ ముందుకు రాకపోవడంతో మా ఛానెల్‌తో ఉన్న సన్నిహిత్యం కారణంగా కింగ్‌ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించడానికి అంగీకరించినట్లు సమాచారం.ఇక మూడవ సీజన్‌కు సంబంధించి కంటెస్టంట్ల ఎంపికలో కూడా నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పాటించినట్లు తెలుస్తోంది.రెండవ సీజన్‌ తరహాలో కాకుండా కొంచెం తెలిసిన సెలెబ్రిటీలతో పాటు వివాదాలు సృష్టించగలిగే వ్యక్తులను కంటెస్టంట్ల జాబితాలో ఉండేవిధంగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం.ఇక బిగ్‌బాస్‌ 3 కంటెస్టంట్ల జాబితా ఇదేనంటూ ఒక వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది.సింగర్‌ రాహుల్ సిప్లిగుంజ్, ‘మహాతల్లి’ ఫేమ్‌ జాహ్నవి, బాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమల్ కామరాజు,హీరో వరుణ్‌ సందేశ్‌,యాంకర్‌ ఉదయభాను,సింగర్‌ హేమచంద్ర,కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్, జబర్దస్త్ నటుడు  నరేష్,పరిచయం అక్కర్లేని కేఏ పాల్‌,టీవీ యాంకర్‌,నటి శ్రీముఖి,టిక్‌టాక్‌ ఫేమ్ ఉప్పల్‌బాలు,మిస్‌ ఇండియా గద్దె సింధూర,టీవీ ఆర్టిస్ట్‌,సినీ నటుడు జాకీల పేర్లు వినిపిస్తున్నాయి.వీరితో పాటు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయి పేరు కూడా వినిపిస్తోంది..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos