క్షమాపణ చెప్పను

క్షమాపణ చెప్పను

చెన్నై : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్కు వ్యతిరేకంగా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని నటు డు రజనీకాంత్ మంగళవారం ఇక్కడ తేల్చి చెప్పారు. తాను చదివిన వార్తాంశాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించా రు. తమిళ వార పత్రిక – తుగ్లక్ 50వ వార్షికోత్సవంలో రజనీకాంత్ ప్రసంగించారు. 1971లో సేలంలో మూఢ నమ్మ కాలకు వ్యతిరేకంగా శ్రీరాముడు, సీత నగ్న చిత్రాలతో పెరియార్ నిర్వహించిన ర్యాలీ గురించి ఒక్క పత్రికావార్తను ప్రచురించ లేదన్నా రు. తుగ్లక్ పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు చో రామస్వామి ఒక్కరే ఆ వార్తను రాసి ,ఖండించారని గుర్తు చేశారు. ఇది కరుణా నిధి నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని కుదిపేయ టంతో ఆ పత్రిక ప్రత్యేల్ని అధికారులు స్వాధీనం చేసు కున్నారు. దీంతో రామస్వామి వాటిని పునర్ముద్రించినపుడు వేడి వేడి పకోడీల్లా అమ్ముడయ్యాయని వివరించారు. ఇందుకు క్షమాపణ చెప్పాలని డ్రవిడార్ విదుతులై కజగం (డీవీకే) డిమాండ్ చేసింది. లేకుంటే థియేటర్లలో ఆయన సినిమా- దర్బార్ను అడ్డు కుం టా మని హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos