కశ్మీర్‌లో ఏదో జరుగుతోంది..

కశ్మీర్‌లో ఏదో జరుగుతోంది..

న్యూ ఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో యురోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుల బృందం పర్యటనకు కేంద్రం అనుమతివ్వటాన్ని విపక్షాలు విమర్శించాయి. కశ్మీర్ పర్యటనకు భారతీయులకు అనమతి నిరాకరించి విదేశీపార్లమెంటు సభ్యులు ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతించటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించాయి. కేంద్రం తీరు భారత పార్లమెంటు, ప్రజాస్వామ్యాలకు అవమానకరమని దుయ్య బట్టారు. జమ్మూ-కశ్మీర్ లోకి ప్రవేశించకుండా తనను,మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ను కేంద్రం అడ్డుకోవటాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ‘భారతీయులకు లేని హక్కులు యురోపియన్ యూనియన్ ఎంపీలకు ఉండడమేంటి? దేశానికి తెలియకుండా ఏదో జరుగుతోంద’న్నారు. ‘జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత అక్కడి పరిస్థితుల అధ్యయనానికి యురోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులకు అనుమతివ్వడం మంచి పరిణామమే. భారతీయులకు కశ్మీర్ను సందర్శించే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరం. విపక్షాల నేతలకు కశ్మీర్లో పర్యటించే అవకాశం కల్పించాలి. కశ్మీర్ పరిస్థితులు భారతీయులకు తెలియాల’ని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి చేశారు. 27 మంది ఐరోపా యూనియన్ పార్లమెంటు సభ్యుల బృందం మంగళవారం కశ్మీర్లో పర్యటించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos