ఎర్రమంజిల్ కేసులో తీర్పు వాయిదా

ఎర్రమంజిల్ కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త శాసన సభ భవంతి నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతకు సంబంధించిన కేసులో హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయ స్థానం వాయిదా వేసింది. హెచ్‌ఎండీఏ 2010లో సమర్పించిన మాస్టర్‌ ప్లాన్‌లో ఎర్రమంజిల్‌ పురాతన కట్టడంగా ఉందని న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. రెగ్యులేషన్‌ 13ను ప్రభుత్వం రద్దు చేసే అవకాశమే లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విన్నవించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 183 చట్ట వ్యతిరేకమని తెలిపారు. చారిత్రక కట్టడాల జాబితాను రద్దు చేస్తూ ప్రభుత్వం 183 జీవోను జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos