హొసూరు రైతు బజారు రోడ్డులో ఆక్రమణల తొలగింపు

హొసూరు రైతు బజారు రోడ్డులో ఆక్రమణల తొలగింపు

హొసూరు : తమిళనాడు రాష్ట్రంలోనే ఆదర్శ రైతు బజారుగా హొసూరు రైతు బజారుకు పేరుంది. అయితే రైతు బజారుకు వెళ్లే రోడ్డును చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఆక్రమించుకున్నారని, దీని వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆక్రమణలు తొలగించినా, కొద్ది రోజులకే షరా మామూలైంది. రైతు బజారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై మళ్లీ దుకాణాలను ఏర్పాటు చేశారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు, రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు ఆక్రమణలను తొలగించారు. రోడ్డు పక్కనున్న దుకాణాలన్నిటినీ తొలగించారు. హొసూరు కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం, ఆస్పత్రులకు వెళ్లడానికి స్థానికులు ఈ రోడ్డునే వినియోగిస్తారు. అయితే ఎప్పుడూ అక్కడ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుండడంతో స్థానికుల ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆక్రమణలను తొలగించడానికి ఉపక్రమించినప్పుడు వ్యాపారులు అడ్డు పడ్డారు. రాస్తారోకో నిర్వహించడానికి సిద్ధపడ్డారు. పోలీసులు వారిని నిలువరించడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు ఆక్రమణలు తొలగించడంతో అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos