అప్రకటిత అత్యయిక స్థితి

అప్రకటిత అత్యయిక స్థితి

న్యూ ఢిల్లీ:దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి కొనసాగుతోందని డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు వ్యాఖ్యానించారు. మంగళ వారం లోక్సభలో జమ్ము-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు గురించి జరిగిన చర్చలో పాల్గొన్నారు. మెహబుబా ముఫ్తీ, ఫరుఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. జమ్మూ-కశ్మీర్ను జైలుగా మార్చేశారని మండి పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు తాత్కాలిక ప్రొవిజన్ సరిపోతుందని ఎలా చెబుతారని నిలదీశారు. ఎంతో చరిత్ర కలిగిన కశ్మీర్ను ఎలా ముక్క చెక్కలు చేస్తారని ప్రశ్నించారు. అంత హడావిడిగా రాష్ట్రపతి గెజిట్ను ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. కశ్మీర్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాన్ని విభజించారని తప్పు బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos