సూలగిరి ప్రాంతంలో ఏనుగుల స్వైర విహారం

సూలగిరి ప్రాంతంలో ఏనుగుల స్వైర విహారం

హోసూరు : హోసూరు సమీపంలోని సూలగిరి ప్రాంతంలో రెండు ఏనుగులు సోమవారం రాత్రి పంటలపై పడి నాశనం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని ఎలిసేపల్లి గ్రామ సమీపంలోకి సోమవారం రాత్రి రెండు ఏనుగులు వచ్చాయి. ఈ ఏనుగులు ఎలిసేపల్లి గ్రామానికి చెందిన రైతులు పండించిన టమోటా, బీన్స్ ,క్యారెట్ తదితర పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులు స్వైర విహారం చేయడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడ్డారు. చేతికొచ్చిన పంటలను రాత్రికి రాత్రే ఏనుగులు ధ్వంసం చేయడం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని ఎలిసేపల్లి, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతానికి తరిమి వేయాలని రైతులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos