18 ఏనుగుల అనుమానాస్పద మృతి

18 ఏనుగుల అనుమానాస్పద మృతి

డిస్పూర్: నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ వద్ద కాతియోటోలి పరిధిలోని కండోలి ప్రతిపాదిత రిజర్వ్డ్ ఫారెస్ట్ (పీఆర్ఎఫ్) లో గురువారం 18 అడవి ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక ప్రమాదంలో గజరాజులు మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా కలకలం రేగింది. ఏనుగులు మరిణించడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. ‘ఇది చాలా మారుమూల ప్రాంతం. వాటి కళేబరాలను రెండు గ్రూపులుగా పడి ఉన్నట్లు కనుగొనబడింది. 14 కొండపైన, మరో నాలుగు ఏనుగులను బయట కనుగొన్నామ’ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అమిత్ సహే పేర్కొన్నారు. ‘ఈ సంఘటనతో నేను తీవ్రంగా బాధపడుతున్నాన’ని పర్యావరణ, అటవీ మంత్రి పరిమల్ సుక్లబైద్యా అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ ‘ఆ ప్రదేశాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos