ఏనుగు స్వైర విహారం

హొసూరు : గ్రామీణ ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తున్నందున ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. హొసూరు సమీపంలోని సూలగిరి అటవీ ప్రాంత గ్రామాల సమీపంలో గత కొద్ది రోజులుగా ఓ ఏనుగు సంచరిస్తున్నది. దీంతో రైతులు పొలం పనులకు వెళ్లేందుకు కూడా జంకుతున్నారు. శుక్రవారం ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో హొసూరు సమీపంలోని బుక్కసాగరం గ్రామం వద్దకు వచ్చిన ఏనుగును చూసిన గ్రామస్థులు పరుగులు తీసి,

ప్రాణాలను కాపాడుకున్నారు. గ్రామానికి అతి చేరువగా ఏనుగు రావడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో టపాసులు పేల్చి ఏనుగును అడవిలోకి తరిమివేశారు. రాత్రుల్లో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి దాపురించిందని గ్రామస్థులు వాపోతున్నారు.ఒంటరి ఏనుగును దట్టమైన ఆటవీ ప్రాంతానికి తరిమివేసి, పంటలను కాపాడాలని బుక్కసాగరం, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos