పట్టుబడిన ఏనుగు : సత్యమంగళానికి తరలింపు

పట్టుబడిన ఏనుగు : సత్యమంగళానికి తరలింపు

హోసూరు : ఇక్కడికి  సమీపంలో 15 రోజుల్లో ముగ్గురిని హతమార్చిన ఏనుగును మత్తు మందు ద్వారా బంధించి సత్యమంగళం అటవీ ప్రాంతానికి తరలించారు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలో గల అటవీ ప్రాంతంలో  ఏనుగుల మందు నుంచి విడిపోయిన ఓ ఒంటరి ఏనుగు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ రైతులపై దాడి చేసి ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ ఏనుగును తరిమివేయాలని రైతులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వరుసగా రైతులపై దాడి చేస్తున్న ఏనుగును పట్టుకుని, దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి వేయడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు

చేపట్టారు. అందులో భాగంగా ఏనుగుకు మత్తు మందు ఇచ్చి బంధించడం ద్వారా దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి వేసేందకు 50 మందితో కూడిన సిబ్బంది రంగంలోకి దిగారు. బుధవారం సాయంత్రం నుంచి ఏనుగు సంచరిస్తున్న ప్రాంతంపై అటవీశాఖ అధికారులు నిఘా పెట్టారు. గురువారం ఉదయం డెంకణీకోట సమీపంలోని తిమ్మసముద్రం  గ్రామం వద్ద ఏనుగు సంచరిస్తున్నట్లు

గుర్తించిన అటవీశాఖ అధికారులు దానికి మత్తు ఇంజక్షన్ వేసి బంధించారు. తరువాత క్రేన్ ద్వారా లారీలోకెక్కించి సత్యమంగళం అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో డెంకణీకోట ప్రాంత రైతులు ఊపిరి పీల్చుకున్నారు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏనుగు ముగ్గురిని  హతమార్చిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos