ప్రధానిపై కోడి గుడ్డు

ప్రధానిపై కోడి గుడ్డు

సిడ్నీ: ఆస్ట్రేలియా న్యూ సౌత్‌ వేల్స్‌లో మంగళ వారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రధాని స్కాట్‌ మారిసన్పై కోడిగుడ్డు విసిరేందుకు ఓ మహిళ యత్నించింది. న్యూ సౌత్‌ వేల్స్‌లోని ఓ మహిళా సంఘం కార్యక్రమంలో ఆయన కొందరు మహిళలతో మాట్లాడుతున్నపుడు వెనుక నుంచి ఓ వృద్ధ మహిళ హఠాత్తుగా వచ్చి మారిసన్‌ తలపై కోడిగుడ్డు విసిరేందుకు యత్నించింది. దీన్ని గమనించిన ప్రధాని వ్యక్తిగత భద్రతాసిబ్బంది ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది పట్టుకోబోతుండగా మహిళ కింద పడి పోయింది. వెంటనే మారిసన్‌ ఆమెకు పైకి లేపి ,చేయి అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos