ఈడీకి మరిన్ని అధికారాలు

ఈడీకి మరిన్ని అధికారాలు

న్యూ ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రత్యర్థి నేతలను వేధింపులకు గురిచేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా విమర్శిస్తున్నాయి. అయితే, దీన్ని పట్టించుకోని కేంద్రం.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ-2002)కు గత మేలో సవరణలను చేయడం తద్వారా ఈడీకి విస్తృత అధికారాలను కట్టబెట్టడం చర్చనీయాంశం మారింది.ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు కూడా సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. పీఎంఎల్ఏకు ఆర్థిక చట్టాల మాదిరిగా సవరణలు చేయడం రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందో కాదో సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని ఆయా పార్టీలు కోరుతున్నాయి. ఆస్తులు జఫ్తు చేసేందుకు ట్రిబ్యునల్ నుంచి అనుమతి తీసుకోవాలన్న క్లాజును పీఎంఎల్ఏ నుంచి తొలగించారని, విపక్ష పార్టీల నేతలను వేధించడానికే కేంద్రం చట్టంలో ఈ విధంగా ఏకపక్ష సవరణలు చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos