సూర్యుడికి గ్రహణం వీడింది

సూర్యుడికి గ్రహణం వీడింది

హైదరాబాద్‌:  దాదాపు పదేళ్ల  తర్వాత పూర్తి స్థాయి సూర్యగ్రహణం దక్షిణాది వాసులకు ఆకాశంలో కనువిందు చేసింది. ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం మూడు గంటల పాటు సాగింది. ప్రజలు సూర్య గ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. అరుదైన సూర్యగ్రహణం ముగిసిన అనంతరం దేవాలయాల్లో సంప్రోక్షణ, ఆలయాల శుద్ధి ఆరంభించారు. తర్వాత భక్తుల్ని దైవ దర్శనానికి అనుమతించనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్య గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక  సోలార్ ఫిల్టర్ ద్వారా విద్యార్థులు ఘట్టాన్ని వీక్షించారు. విద్యార్థులకు సూర్య గ్రహణ కారణాలను వివరించారు. సూర్య గ్రహణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూలు నగరంలో జన విజ్ఞాన వేదిక సదస్సుల్ని నిర్వహించింది.  గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కంటికి ప్రమాదం ఉన్నందున సోలార్‌ ఫిల్టర్‌ ద్వారా వీక్షించవచ్చనని ప్రజలకు తెలియజేశారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోరాదని,  బయట  సంచరించరాదనే అపోహల్ని పోగొట్టేందుకు కొన్ని సంస్థలు గ్రహణ సమయంలో నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద అల్పాహారాన్ని ఏర్పాటు చేసి తినాలని  ప్రజలను ప్రోత్సహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos