ముందుంది మొసళ్ల పండుగ

ముందుంది మొసళ్ల పండుగ

న్యూ ఢిల్లీ: చైనా తో సరిహద్దు వివాదం కారణంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కేంద్రం సుంకాన్ని పెంచదలుస్తోంది. అనవసరమైన వస్తువుల దిగుమతి తగ్గించటమే దీని ఆశయమని అధికార్లు తెలిపారు. మన మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 14%. నిరుడు ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2020 వరకు 62.4 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులు దిగుమతి అయ్యాయి. వీటిలో గోడ గడి యారా లు, సంగీత వాయిద్యాలు, వాచ్ లు, బొమ్మలు, క్రీడా వస్తువులు, ఫర్నీచర్, దుప్పట్లు, ప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎలక్ట్రికల్ మెషినరీ, రసాయనాలు, ఇనుము ఉక్కు వస్తువులు, ఎరువులు, ఖనిజ ఇంధనం, లోహాలు మొదలైనవి ఉన్నాయి. సుంకాల్ని పెంచితే వాటి ధరలూ పెరుగుతాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులు చాలా మందికి అందని మాని పళ్లవుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos