పెంచిన సుంకాల్ని తగ్గించాల్సిందే

పెంచిన సుంకాల్ని తగ్గించాల్సిందే

వాషింగ్టన్: అమెరికా టారిఫ్లకు పోటీగా భారత్ ఇటీవల విధించిన సుంకాల్ని ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. శుక్రవారం జపాన్లో జరగనున్న జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో భేటీఅయినపుడు ఈ విషయాన్ని ప్రస్తావించి తీరుతామని చెప్పారు. ‘భారత్ కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ సుంకాలను పెంచింది. దీనిని మేము ఏమాత్రం ఆమోదించబోము. వీటిని కచ్చితంగా వెనక్కు తీసుకోవాల్సిందే’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవలే 28 రకాల అమెరికా వస్తువులపై సుంకాలను పెంచింది. భారత్కు జీఎస్పీ హోదాను తొలగించినందుకు ప్రతీకారంగా ఈ సుంకాల్ని విధించింది. వీటిల్లో బాదం, ఆపిల్, పప్పు దినుసులు, అక్రోటు వంటి ఎండు ఫలాలూ ఉన్నాయి. ఇది ట్రంప్కు అమెరికాలో బలమైన మద్దతు దారులైన గ్రామీణుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 2020 ఎన్నికలు జరగనున్నందున ట్రంప్ భారత్ నిర్ణయం వల్ల ఇబ్బందికి గురవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos