కరవు తాండవిస్తున్నా…ఎన్నికల ధ్యాసేనా…

కరవు తాండవిస్తున్నా…ఎన్నికల ధ్యాసేనా…

హైదరాబాద్ : రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఎన్నికలు తప్ప మరో ధ్యాస లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పలు విధానాలను తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 450 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కరవు, విద్య, వైద్యం అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కాళేశ్వరం తప్ప దేన్నీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos