తమిళనాట సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్

తమిళనాట సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌ను తీసుకొచ్చింది. పురుషులు సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలని, మహిళా ఉద్యోగులు చీరలు లేదా దుపట్టాతో ఉన్న చుడీదార్‌, సల్వార్‌ కమీజ్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కార్యాలయ గౌరవ, మర్యాదలను కాపాడడానికి డ్రెస్‌కోడ్‌ను అనుసరించాలని ఆదేశించారు. కోర్టులు, ట్రైబ్యునల్‌ లేదా న్యాయ కమిటీ ముందు హాజరయ్యే పురుష ఉద్యోగులు తప్పనిసరిగా ట్రౌజర్లు, కోట్ ధరించాలని పేర్కొన్నారు. ఇటీవల సచివాలయంలో పని చేసే కొందరు యువకులు జీన్స్‌, టీ షర్టులతో విధులకు హాజరయ్యారు. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమిళ సంప్రదాయ దుస్తులైన ధోతీ ధరించవచ్చా, లేదా అన్నది స్పష్టం కాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos