భారీగా పతనమైన రూపాయి

భారీగా పతనమైన రూపాయి

ముంబై: దేశీయ కరెన్సీ-రూపాయి మంగళ వారం భారీగా నష్ట యింది. విపణి ఆరంభంలోనే సాంకేతికంగా కీలకమైన రూ.72 కంటే దిగువకు పతనమైంది. తదుపరి మరింత పతనమైంది. ఆగే సూచనలు కనిపించటం లేదు. సూ ఇంటర్ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 74 పైసలు (1 శాతం పైగా) కోల్పోయి 72.16 స్థాయికి కుప్పకూలింది. ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాలు, ముడి చమురు, బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి కారణంగా భావిస్తున్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపుతో డాలరు ఊపందుకోవడంతో వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. జీడీపీ 5 శాతానికి పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. మదుపర్ల అమ్మకాల వల్ల మంగళవారం రెండు గంటల ప్రాంతంలో ప్రస్తుతం సెన్సెక్స్‌ 56 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 167 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్‌ 37 వేల దిగువకు, నిఫ్టీ 10900 స్థాయిని కోల్పోయి బలహీన సంకేతాలనిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos