ముంబైకి వరుణుడి ముప్పు

ముంబైకి వరుణుడి ముప్పు

ముంబై: ముంబై, శివారు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమ త్తమైన అధికార్లు ముంబై , రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విపత్తు సహాయ సిబ్బంది బృందాలు మూడు నగరానికి చేరుకున్నాయి. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. సముద్ర తీరాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు బయటకు రాకూడదని సూచించారు. ముంబయి, ఠానే, కొంకణ్ ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముంబయి శివారు ప్రాంతమైన వెర్సోవాలో బుధ వారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు ముంబయి భారీ వర్షాలతో మునిగింది. పలువురు మృతి చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos