నాలుగు రాష్ట్రాలు దివాలా?

నాలుగు రాష్ట్రాలు దివాలా?

న్యూ ఢిల్లీ : లాక్డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండి పడింది. సిబ్బంది వేతనాల్లో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోతలు విధించాయి. లాక్డౌన్ ను సడలించ కుండా కొనసాగిస్తే నాలుగు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేవని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అధ్యయనంలో తెలిసింది. అవి- హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. అధిక ఆదాయం వచ్చే రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించాయి. ఆర్థిక లోటు భర్తీకి రుణాల ద్వారా ఆదాయాన్ని సేకరించుకునేందుకు డబ్ల్యూఎంఏ లిమిట్ను ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) 60 వరకు పెంచింది. అయినా కొన్ని రాష్ట్రాల సొంత ఆదాయ వనరులు స్తంభించిపోనున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ఈ పరిస్థితులు బకాయిల చెల్లింపులను ప్రభావితం చేసేలా ఉందని లెక్కగట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos