లాక్‌డౌన్ ఫలాలు.. తగ్గుతున్న కరోనా కేసులు

లాక్‌డౌన్ ఫలాలు.. తగ్గుతున్న కరోనా కేసులు

న్యూ ఢిల్లీ :లాక్ డౌన్ ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం ఇక్కడ తెలిపారు. సామాజిక దూరం వల్ల రోగుల సంఖ్య తగ్గక పోయినా, పెరుగుదల నిష్పత్తి తగ్గుతోందని వివరించారు.అయినా ఈ విషయంలో ఉదాశీనత పనికి రాదని హెచ్చరించారు. కొందరు రోగులకు ఆ వైరస్ ఎక్కడి నుంచి సోకిందో తెలియడం లేదన్నారు. అంతమాత్రాన దాన్ని సామాజిక వ్యాప్తిగా ప్రచారం చేయడం తగదన్నారు. ప్రభుత్వ మార్గ దర్శకాలను అమలు చేయకుంటే మాత్రం సామాజిక వ్యాప్తి తప్పదని హెచ్చరించారు. ఇంట్లో పెద్ద వాళ్లతోనూ కనీసం మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రమణ్ ఆర్. గంగాఖేడ్కర్ సూచించారు. గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 694 మంది కరోనాతో బాధ పడుతున్నారు. శుక్రవారంఒక్క రోజులోనే 90 కేసులు నమోదు కావడం గమనార్హం.

తాజా సమాచారం