జులై5న రౌడీ తమ్ముడి చిత్రం విడుదల..

  • In Film
  • May 22, 2019
  • 151 Views
జులై5న రౌడీ తమ్ముడి చిత్రం విడుదల..

అర్జున్‌రెడ్డి చిత్రంతో విజయ్‌ దేవరకొండకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ వచ్చింది.అనంతరం విడుదలైన గీతగోవిందం చిత్రం సాధించిన విజయంతో క్రేజ్‌ శాశ్వతమైంది.అలాఅలా ప్రతీ సినిమాకు విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ అమాంతం పెరుగుతూవెళ్లింది.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు.ఈ తరుణంలో విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.యాంగ్రీహీరో రాజశేఖర్‌ తనయురాలు శివాత్మిక హీరోయిన్‌ నటిస్తున్న దొరసాని చిత్రంలో శివాత్మికకు జోడీగా నటిస్తున్నాడు.పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రాగినేని – మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమాను జులై 5న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న చిత్ర బృందం సినిమాకు సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. రెండు ఈవెంట్స్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా సిద్దమవుతున్నట్లు టాక్. మరి తమ్ముడి సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడో చూడాలి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos