వైద్యుడిపై భజరంగ్‌దళ్‌ దాడి..

వైద్యుడిపై భజరంగ్‌దళ్‌ దాడి..

క్లీనిక్‌ ప్రచారం కోసం హిందూ దేవతల ఫోటోలు వాడుకున్నందుకు భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు వైద్యుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఒడిశాలోని నబరన్‌పూర్ జిల్లా జరిగాన్‌లో భవతోష్ మండల్ అనే ఆయుర్వేదిక్ వైద్య నిపుణుడు కొన్ని నెలల క్రితం జరిగాన్‌లో క్లినిక్ ఏర్పాటు చేశాడు. లైంగిక సంబంధిత వ్యాధులు(STDs)కి అతను చికిత్స అందిస్తున్నాడు. అయితే క్లినిక్ ప్రమోషనల్ పోస్టర్స్‌లో హిందూ దేవతల చిత్రాలను వాడటం భజరంగ్‌దళ్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది.దీంతో క్లినిక్‌కి వెళ్లి భవతోష్‌పై దాడి చేసి అతనితో బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos